కెరీర్ గైడెన్స్.. ఇన్సూరెన్స్-యాక్చూరియల్ సైన్స్

బీమా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అనివార్యం.. కల చెదరని భవిష్యత్తుకు మెరుగైన సాధనం..నాడు వ్యక్తి జీవితానికి మాత్రమే బీమా.. నేడు ఆరోగ్యం, ప్రయాణాలు, వాహనం, విలువైన వస్తువులు, స్థిరాస్తి, వ్యాపారం ఇలా అంతటా విస్తరించింది. ప్రభుత్వ కంపెనీలతోపాటు ప్రైవేట్ కంపెనీలు కూడా రంగ ప్రవేశం చేయడంతో ఇన్సూరెన్స్ సిబ్బంది కొరత ఏర్పడింది. ఏజెంట్, డెరైక్ట్‌సేల్స్ ఎగ్జిక్యూటివ్, డెవలప్‌మెంట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, యాక్చూరీ, రిస్క్ మేనేజర్.. ఇలా భిన్న పోస్టులు బీమా కంపెనీల్లో కొలువుదీరాయి. శరవేగంగా విస్తరిస్తున్న బీమా రంగంలో కెరీర్‌పై ఫోకస్..
ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి పలు ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా ఈ రంగంలో ప్రవేశించవచ్చు. ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి కోర్సులందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు..


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్- (ఐఐఆర్‌ఎం).
ఈ సంస్థను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటుచేశారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సులను లండన్‌లోని చార్టర్డ్ ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ (సీఐఐ) గుర్తించింది.

కోర్సులు:
ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్
ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్
ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత
వెబ్‌సైట్: www.iirmworld.org.in

నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ-పుణె
వెబ్‌సైట్: www.niapune.com

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ-గ్రేటర్ నోయిడా
వెబ్‌సైట్: www.bimtech.ac.in

అమిటీ యూనివర్సిటీ-నోయిడా
వెబ్‌సైట్: www.amity.edu

ఆపీజే స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: https://apeejay.edu

నేషనల్ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-బెంగళూరు
వెబ్‌సైట్: www.inclipnetwork.org

సింబయాసిస్ దూరవిద్య విధానంలో పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్.
వెబ్‌సైట్: www.scdl.net

కెరీర్ ప్రాస్పెక్ట్స్
ఏజెంట్:
అర్హత: ఇంటర్మీడియెట్
ఏం చేస్తాడు: పనిచేస్తున్న బీమా కంపెనీకి సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ పాలసీలను పాలసీదారుడికి వివరించి, అతని అవసరానికి సరిపడే పాలసీ సూచించి ఆ పాలసీ కట్టేలా చే యాలి.
స్కిల్స్: తన మాటలతో పాలసీదారుణ్ని ఆకర్షించే నైపుణ్యం, మిగిలిన కంపెనీలకు చెందిన ఇదేవిధమైన పాలసీలకు దీనికి తేడాలను వివరించే సమర్థత ఉండాలి. పాలసీదారుడికి పాలసీలో లేని హామీల గురించి చెప్పరాదు.

బెనిఫిట్స్:
మొదటి ఏడాది పాలసీదారుడు కట్టిన ప్రీమియంలో ఆకర్షణీయమైన కమీషన్‌గా ఏజెంట్‌కు లభిస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రీమియం కట్టిన ప్రతి సందర్భంలోనూ 5 శాతానికి తగ్గకుండా కమీషన్ లభిస్తుంది. (కంపెనీ, పాలసీ బట్టి కమీషన్‌లో వ్యత్యాసాలుంటాయి). చేసే పాలసీలు బట్టి హోదా పెరుగుతుంది. బ్రాంచ్ క్లబ్ మెంబర్, జీఎం క్లబ్ మెంబర్, ఆర్‌ఎం క్లబ్ మెంబర్.. లాంటి హోదా సొంతమవుతుంది. హోదాను బట్టి వివిధ అలవెన్సులు, కారు సౌకర్యం... లాంటివి ఉంటాయి.

డెవలప్‌మెంట్ ఆఫీసర్:
నిర్ణీత పరిధిలోని ఏజెంట్లకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు. కంపెనీ రెవెన్యూ పెంచడంలో కీలకపాత్ర డీఓదే. కొత్తపాలసీల గురించి ఏజెంట్లకు చెప్పడం, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల్లో బీమాపై అవగాహన పెంచి వారిని పాలసీదారులుగా మార్చడం డీఓ విధి. డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టుకు అర్హులు. ఎల్‌ఐసీతోపాటు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. కంపెనీ ఏరియా టార్గెట్‌లు చేరుకోవడంలో డీఓదే ప్రధాన బాధ్యత.

ఇన్సూరెన్స్ అడ్వైజర్:
పాలసీదారుడికి ఏ పాలసీ సరిపోతుంది. ఎంత వరకు ప్రీమియం కట్టొచ్చు. ఆ పాలసీ అతనికి ఎందుకు ఉపయోగపడుతుంది తదితర విషయాలు చెప్తారు. ఫైనాన్స్ లేదా ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌గా చదివినవాళ్లు ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా రాణించొచ్చు.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్:
ఎల్‌ఐసీ, ఎన్‌ఐసీ, జీఐసీలు ప్రతి ఏటా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన విడుదల చేస్తుంటాయి. దీనికి అర్హత డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వయోపరిమితి: 21-30 ఏళ్లు. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో: రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ (గ్రామర్, ఒకాబులరీ) అంశాల్లో ఆబ్జెక్టివ్ పరీక్షతో పాటు ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.

డెరైక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్:
ప్రొడక్ట్ సేల్స్ కోసం వీళ్లను నియమిస్తారు. ఎల్‌ఐసీతో పాటు వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు డెరైక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భ ర్తీ చేస్తున్నాయి.

ఉద్యోగాలిక్కడ:
ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్, యాక్సెంచూర్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటాక్ సెక్యూరిటీస్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రెలిగేర్, మహేంద్ర ఇన్సూరెన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్.

యాక్చూరియల్ సైన్స్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్, అవకాశాలు ఉన్న కోర్సు ఇది. రిస్క్ అంచనా వేయడం, ఫైనాన్స్ విభాగాన్ని లోతుగా అర్థం చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి వ్యూహాన్ని సిద్ధం చేయడం, వర్తమానాన్ని విశ్లేషించడం, భవిష్యత్తుని అంచనా వేయడం.. ఇవన్నీ యాక్చూరీలు చేస్తారు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ల్లో ఉన్నత శ్రేణి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసినవాళ్లు; మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్‌ల్లో పీజీ చేసినవాళ్లు ఈ కోర్సు చేస్తే ప్రయోజనం. కోర్సుకు నిర్ణీత వ్యవధి ఉండదు. ఈ కోర్సుకు దేశంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) ప్రసిద్ధ సంస్థ. ఇందులో మూడు రకాల మెంబర్‌షిప్‌లు ఉన్నాయి. అవి స్టూడెంట్ మెంబర్, అసోషియేట్ మెంబర్, ఫెలో మెంబర్. యాక్చూరీ అవార్డు పొందాలంటే 15 సబ్జెక్టులు పూర్తిచేయాలి. ప్రస్తుతం ఈ విభాగంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో 10 సబ్జెక్టులు పూర్తిచేసినవాళ్లు *6 లక్షలకు పైగా ఆరంభవేతనం అందుకుంటున్నారు.

యాక్చూరీ సైన్స్ చదివిన వాళ్లకు లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్‌లలో, పెన్షన్ ఫండ్లు, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. డిగ్రీ, పీజీ అభ్యర్థులకు ఎల్‌ఐసీ యాక్చూరీ అప్రెంటిస్‌షిప్ నిర్వహిస్తుంది. 18-25 ఏళ్ల వయసు వాళ్లు అర్హులు.

జీతాలిలా:
కోర్సు పూర్తిచేసినవారికి ఆరంభంలో ఏడాదికి * 6 లక్షలు, రెండేళ్ల అనుభవంతో ఏడాదికి రూ.9 లక్షలు, ఐదేళ్ల అనుభవంతో రూ.24 లక్షలు, పదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు రూ.36 లక్షలకుపైగా వేతనం పొందొచ్చు.

యాక్చూరియల్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనోమెట్రిక్స్, యాక్చూరియల్ సబ్జెక్టుల్లో ఎందులో నైనా 60 శాతం మార్కులు.
వెబ్‌సైట్: www.iirmworld.org.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా
వెబ్‌సైట్: www.actuariesindia.org

అమిటీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.amity.edu

కురుక్షేత్ర యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.kuk.ac.in

నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
వెబ్‌సైట్: https://nmims.edu

యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
వెబ్‌సైట్: www.unom.ac.in

నేషనల్ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-బెంగళూరు
వెబ్‌సైట్: www.inclipnetwork.org










































#Tags