SBI Recruitment: ఎస్‌బీఐలో రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌–ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్‌ సెంటర్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 150
»    పోస్టుల వివరాలు: ట్రేడ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌(ఎంఎంజీఎస్‌–2)–మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌–స్కేల్‌2–150.
»    అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఐఐబీఎఫ్‌ ఫారెక్స్‌ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్‌ ఫైనాన్స్‌ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
»    వయసు: 31.12.2023 నాటికి  23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
»    పే స్కేల్‌: నెలకు రూ.48,170 నుంచి రూ. 69,810 లభిస్తుంది.
»    ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 07.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.06.2024
»    వెబ్‌సైట్‌: https://sbi.co.in

BSF Direct Recruitment: బీఎస్‌ఎఫ్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags