Junior Assistant Posts Notification : 200 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు నియామక ప్రకటన విడుదల.. ఎంపిక విధానం ఇలా..!
ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న
కార్యాలయాల్లో.. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర సమాచారం..
మొత్త పోస్టులు 200
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించిన తాజా నోటిఫికేషన్ ద్వారా 15 రాష్ట్రాల్లో మొత్తం 200 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12 పోస్టులు, తెలంగాణలో 31 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని పోస్ట్‌లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Open Tenth Admissions : ఏపీ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు.. వీరే అర్హులు..
అర్హతలు
➨ 2024, జూలై 1 నాటికి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
➨ కంప్యూటర్ ఆపరేషన్స్/కంప్యూటర్ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ కలిగుండాలి (లేదా) హైస్కూల్/కాలేజŒ /ఇన్‌స్టిట్యూట్ స్థాయిలో కంప్యూటర్/
ఐటీని ఒక సబ్జెక్ట్‌గా చదవి ఉండాలి.
➨ వయసు: 2024, జూలై 1 నాటికి 21–28 ఏళ్లు(జూలై 2,1996–జూలై 1,2003 మధ్యలో జన్మించి ఉండాలి).
రెండు దశల ఎంపిక ప్రక్రియ
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌ల నియామకానికి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ.
NEET Paper leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు..‘మాస్టర్‌మైండ్’ అరెస్ట్
200 మార్కులకు రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షను అయిదు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు–40 మార్కులు, కంప్యూటర్ స్కిల్స్ 40 ప్రశ్నలు–40 మార్కులకు పరీక్ష ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
రెండో దశ ఇంటర్వ్యూ
తొలిదశ రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించే అవకాశం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఉన్న పోస్ట్‌లను పరిగణనలోకి తీసుకుని 1:3 లేదా 1:4 నిష్పత్తిలో(ఒక్కో పోస్ట్‌కు ముగ్గురు లేదా నలుగురిని చొప్పున) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులకు బీమా రంగంపై ఉన్న అవగాహన, ఈ రంగంలో సమకాలీన పరిణామాలు, కొలువుపై ఆసక్తి, వ్యక్తిగత నేపథ్యం వంటి అంశాలను పరిశీలిస్తారు.
Combined Hindi Translators Examination : ఎస్‌ఎస్‌సీలో పోస్టుల భర్తీకి కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్–2024 నోటిఫికేషన్ విడుదల..
తుది నియామకాలు
తుది నియామకాలు ఖరారు చేసే క్రమంలో.. రాత పరీక్షలో పొందిన మార్కులను, ఇంటర్వ్యూలో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండింటిలోనూ పొందిన మార్కులతో మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను పరిగణిస్తూ రాష్ట్రాల వారీగా తుది జాబితా సిద్ధం చేస్తారు.
వేతనం
జూనియర్ అసిస్టెంట్ కొలువు ఖరారైన ప్రాంతం ఆధారంగా నెలకు కనిష్టంగా రూ.30 వేలు; గరిష్టంగా రూ.32,800 వేతనం లభిస్తుంది. కేటగిరీ–1 నగరాల్లో నియమితులైన వారికి నెలకు రూ. 32,800; కేటగిరీ–2 నగరాల్లో నియమితులైన వారికి నెలకు రూ.31,200; కేటగిరీ–3 నగరాల్లో నియమితులైన వారికి నెలకు రూ.30,000 నికర వేతనం అందిస్తారు. అదే విధంగా విధుల్లో చేరిన తర్వాత ఆరు నెలల ప్రొబేషన్ పిరియడ్ విధానాన్ని పాటిస్తున్నారు. ఈ సమయంలో పనితీరు సంతృప్తిగా ఉంటే శాశ్వత నియామకం ఖరారు చేస్తారు.
Distance Education: దూరవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
విధులివే
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులైన వారు.. గృహ రుణ దరఖాస్తు ప్రక్రియను నిర్వహించడం, డాక్యుమెంట్ స్కానింగ్, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్, డేటాఎంట్రీ, ఈఎంఐల పేమెంట్‌కు సంబంధించి వినియోగదారులతో నిరంతరం సంప్రదించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతోపాటు కస్టమర్ సర్వీసింగ్, క్యాష్ కౌంటర్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలతోపాటు సంస్థ అప్పగించే ఇతర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
➨ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➨ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఆగస్ట్ 14
➨ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం.
➨ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్.
➨ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.lichousing.com/jobopportunities
➨ ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in/licjajul24
Jobs at ITBP : ఐటీబీపీలో వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ /ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
రాత పరీక్షలో విజయం ఇలా
ఇంగ్లిష్ లాంగ్వేజ్
అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించేందుకు బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
లాజికల్ రీజనింగ్
రీజనింగ్ విభాగంలో రాణించేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ వంటి అంశాలపై అవగాహన పొందాలి.
TG Skill University: తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త: సీఎం రేవంత్
జనరల్ అవేర్‌నెస్
ఈ విభాగంలో స్కోర్ సాధించేందుకు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై పట్టు సాధించాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయ,అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న పరిణామాలను తెలుసుకోవాలి. అదే విధంగా ద్వైపాక్షిక ఒప్పందాలు,జాతీయ–అంతర్జాతీయ సదస్సులు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు ఆయా దేశాలకు సంబంధించిన నూతన అధ్యక్షులు, అంతర్జాతీయ క్రీడలు–విజేతలు,అవార్డు లు వంటి సమాచారాన్ని కూడా సేకరించుకోవాలి.
హౌసింగ్ ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి
జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా అభ్యర్థులు హౌసింగ్ ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దేశంలోని హౌసింగ్ ఫైనాన్స్ స్కీమ్‌లు, ఎల్‌ఐసీ అందిస్తున్న రుణ సదుపాయాలు, హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
DSC 2024: డీఎస్సీ’ మరింత ఆలస్యం?.. ఎవరి వాదన వారిదే..
న్యూమరికల్ ఎబిలిటీ
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా.. ప్యూర్ మ్యాథమెటిక్స్ అంశాలపై దృష్టి సారించాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాలలోని సమాచారాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
కంప్యూటర్ స్కిల్స్
ఈ విభాగానికి సంబంధించి బేసిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్‌పైనా, అదే విధంగా కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ సాధనపైనా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్ టూల్స్ (ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ తదితర)పై అవగాహన ఏర్పరచుకోవాలి. డాక్యుమెంట్స్ క్రియేషన్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ రూపొందించడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు కంప్యూటర్ కీబోర్డ్ షార్ట్ కట్ ఇంప్రెషన్స్ తెలుసుకోవాలి.
Paris Olympics: మనూ భాకర్‌కు మరో గౌరవం.. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా..