OICL Recruitment 2024: బీమా కంపెనీలో ఆఫీసర్‌ పోస్ట్‌లు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ టిప్స్‌..

బీమా రంగం గత కొంతకాలంగా కొలువుల కామధేనువుగా మారుతోంది. పలు బీమారంగ సంస్థలు నిత్యం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ది ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఓఐసీఎల్‌).. మొత్తం 100 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అకౌంటింగ్‌ నుంచి లీగల్‌ వరకూ పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది! ఈ నేపథ్యంలో.. ఓఐసీఎల్‌లో ఏవో పోస్ట్‌లు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
  • 100 ఏఓ పోస్ట్‌ల భర్తీకి ఓఐసీఎల్‌ నోటిఫికేషన్‌
  • మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ
  • ఎంపికైతే నెలకు రూ.85 వేల వేతనం

మొత్తం 100 పోస్ట్‌లు
ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఆరు విభాగాల్లో 100 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో అకౌంట్స్‌–20 పోస్ట్‌లు, యాక్చుయేరియల్‌–5 పోస్ట్‌లు, ఇంజనీరింగ్‌–15 పోస్ట్‌లు, ఇంజనీరింగ్‌ (ఐటీ)–20 పోస్ట్‌లు, మెడికల్‌ ఆఫీసర్‌–20 పోస్ట్‌లు, లీగల్‌–20 పోస్ట్‌లు ఉన్నాయి.

అర్హతలు

  • ఆయా పోస్ట్‌లను అనుసరించి బీకాం/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/ఎంబీఏ(ఫైనాన్స్‌)/ నిర్దేశిత బ్రాంచ్‌లతో బీటెక్‌ లేదా ఎంటెక్‌/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/బీఎస్సీ (స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటిక్స్‌/యాక్చుయేరిల్‌ సైన్స్‌)/ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: డిసెంబర్‌ 31, 2023 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ.

వంద మార్కులకు ప్రిలిమినరీ
ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమినరీ పరీక్షను మూడు విభాగాల్లో 100మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35 మార్కులకు ఉంటాయి. ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట.

చదవండి: Bank of India Recruitment 2024: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులు.. గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

రెండో దశ మెయిన్‌
ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 20 మందిని చొప్పున (1:20 నిష్పత్తిలో) రెండో దశ మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష అయిదు విభాగాల్లో మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 

టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ 40 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 40 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 మార్కులకు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌/సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ 40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌
మెయిన్‌ పరీక్షలో భాగంగానే 30 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో 10 మార్కులకు లెటర్‌ రైటింగ్, 20 మార్కులకు ఎస్సే రైటింగ్‌ ఉంటాయి. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌కు కేటాయించిన సమ­యం 30 నిమిషాలు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.

చివరగా ఇంటర్వ్యూ
మెయిన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున ఎంపిక చేసి.. చివరి దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థుల అకడమిక్‌ నేపథ్యం, సబ్జెక్ట్‌ నాలెడ్జ్, ఇన్సూరెన్స్‌ రంగంపై ఉన్న ఆసక్తి తదితర అంశాలను పరిశీలిస్తారు.

వెయిటేజీ విధానం
తుది విజేతలను ప్రకటించే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో సాధించి­న మార్కులకు 80 శాతం; పర్సనల్‌ ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. దీనికి అనుగుణంగా అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి.. తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.

సర్వీస్‌ బాండ్‌.. ప్రొబేషన్‌
ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరేముందు సర్వీస్‌ అగ్రిమెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సంస్థలో కనీసం నాలుగేళ్లపాటు విధులు నిర్వర్తిస్తామని తెలిపే విధంగా బాండ్‌ సమర్పించాలి. తుది నియామకాలు ఖాయం చేసుకున్న వారికి ఏడాది ప్రొబేషనరీ పిరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో వారు ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఆకర్షణీయ వేతనం
అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా కొలువు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. ప్రారంభంలోనే నెలకు రూ.85 వేల వేతనం అందుతుంది. మూల వేతనాన్ని రూ.50,925 (పే స్కేల్‌ రూ.50,925–రూ.96,765)గా నిర్ధారించారు. దీని­కి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి ఇతర భత్యా­లు లభిస్తాయి. వీటితోపాటు మెడికల్‌ ఇన్సూరెన్స్, ఎల్‌టీఎస్‌ వంటి సదుపాయాలు సైతం ఉంటాయి.

ముఖ్య సమాచారం

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్‌ 12
  • రాత పరీక్షల తేదీలు: మే/జూన్‌లో నిర్వహించే అవకాశం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://orientalinsurance.org.in/web/guest/careers

రాత పరీక్షలో రాణించేలా
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌­తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వర­కు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిష­న్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ
ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో కీలకమైన విభాగం.. రీజనింగ్‌. దీనికోసం సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగంలో బెస్ట్‌ స్కోర్‌ కోసం హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు ఇన్సూరెన్స్‌ రంగంలో తాజా పరిణామాలు, స్టాక్‌ జీకే, ఆర్థిక సంబంధ పరిణామాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్,టైం అండ్‌ వర్క్, ప్రాఫి­ట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు నంబర్‌ సిరీ­స్, డేటా అనాలిసిస్‌ విభాగాలను సాధన చేయాలి. ఫలితంగా ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌
అన్ని పోస్ట్‌లకు ఉండే విభాగం.. ప్రొఫెషనల్‌ నా­లెడ్జ్‌. దీనికోసం అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్‌పై ఫోకస్‌ చేయాలి. బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ము­ఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

మెయిన్స్‌ దృక్పథం
అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచే మెయిన్‌ పరీక్ష దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగించాలి. మూడు విభాగాలు ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ ప్రశ్నల్లో క్లిష్టత స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. మెయిన్స్‌ దృక్పథంతో చదివితే ప్రిలిమ్స్‌లో సులభంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.

గత ప్రశ్న పత్రాలు
అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు. గ్రాండ్‌ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. అంతేకాకుండా మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అలవడుతుంది. 

చదవండి: Indian Bank Recruitment 2024: ఇండియన్‌ బ్యాంక్ లో 146 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags