IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఉద్యోగం,లక్షల్లో జీతం..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 54
పోస్టుల వివరాలు:

  • ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెంట్) - 28 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్)- 21 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్)- 5 పోస్టులు

అర్హత: బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి. 

వేతనం: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000; 
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15,00,000;
ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 వేతనం ఉంటుంది.

వయస్సు: 22- 45 ఏళ్లకు మించరాదు
దరఖాస్తు రుసుం: రూ.750,  ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకైతే రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: మే24, 2024

#Tags