Five Government Jobs Got Ramesh Success Story : ఈ క‌సితోనే.. ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టానిలా.. కానీ చివ‌రికి...!

మ‌న ప్ర‌య‌త్నంలో కొన్ని సార్లు ఫెయిల్ అవ్వ‌డం స‌హ‌జమే. ఇది కూడా మ‌న మంచికే అనుకుని చాలా మంది మ‌రో సారి ప్ర‌య‌త్నం చేస్తునే ఉంటారు. వీరు జీవితంలో ఎదో సాధించాలనే తపనతో ఎంతో మంది తమ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ఉంటారు.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఎంతో మంది రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటారు. కొందరు ఎంత కష్టపడినా కూడా .. కొన్ని కారణాల వలన ఒక్కోసారి విఫలం అవుతూ ఉంటారు. అలా విఫలం అయినా సరే కొంతమంది పట్టు వదలకుండా తమ లక్ష్యాన్ని ఛేదించే దిశగానే పయనిస్తూ...చివరికి వారు అనుకున్నది అందిపుచ్చుకుంటారు. 

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు ఈ యువ‌కుడు. అదృష్టం అంటే ఈ యువ‌కుడిదే. అలా అని దాని వెనుక వారి కష్టం లేక పోదు. ఈ నేప‌థ్యంలో ఈ యువ‌కుడి రియల్ లైఫ్ స్టోరీ మీకోసం..

అన్ని కోరుకున్న ఉద్యోగాలే..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ యువకుడిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక ప్రైవేట్ ఉద్యోగం సాధించాడు. అది కూడా అతను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాలే అతనికి దక్కాయి. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందని చెప్పడానికి ఈ వ్యక్తి జీవితమే ఉదాహరణగా నిలుస్తుంది.

➤☛ Inspirational Success Story : మట్టి ఇంట్లో నివాసం.. రూ.2 కోట్ల జాక్‌ పాట్‌ కొట్టిన యువ‌కుడు.. ఎలా అంటే..?

కుటుంబ నేప‌థ్యం :
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తొలాపికి చెందిన.. పప్పల హరి అప్పారావు, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు రమేష్‌. రమేష్ తండ్రి హరి అప్పారావు పూసపాటిరేగ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

బీటెక్ చదువుతున్న సమయంలోనే...
రమేష్ విజయనగరంలోని జేఎన్‌టీయూలో.. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. అయితే.., బీటెక్ చదువుతున్న సమయంలోనే రమేష్‌కు.. క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎస్‌లో ఆఫర్ వచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే దృఢ నిశ్చయంతో.. రమేష్ టీసీఎస్‌లో ఆఫర్‌ను వదులుకున్నాడు.

☛ UPSC Civils 2nd Ranker Animesh Pradhan Story : చిన్న వ‌య‌స్సులోనే నాన్న మృతి.. మ‌రో వైపు సివిల్స్ ఇంట‌ర్వ్యూ టైమ్‌లోనే అమ్మ మ‌ర‌ణం.. ఆ బాధతోనే..

ఈ ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో.. ఏ ఒక్క ఆఫర్‌ను..
ఆ తర్వాత తానూ అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసి.. ప్రభుత్వ పరీక్షల కోసం ఎంతో కష్టపడి చదివాడు. అతని కష్టానికి ప్రతి ఫలంగా.. మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ కో ఆపరేటివ్‌ బ్యాంకు మేనేజరుగా ఉద్యోగం వ‌చ్చింది. అలాగే ఎస్‌బీఐ కర్ల్క్‌గా, ఏపీజీవీబీలో ఆడిట్ అధికారిగా ఎంపికయ్యాడు రమేష్. కానీ వీటిలో ఏ ఒక్క ఆఫర్‌ను అందిపుచ్చుకోలేదు. 

ఏడాది వ్యవధిలో ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను 
ఇంకా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న క్రమంలో నాబార్డ్‌ నిర్వహించిన పరీక్షలకు సిద్దమయ్యాడు. ఈ ఉద్యోగం కోసం ఇంకా చాలా క‌ష్ట‌ప‌డి చ‌దివాడు. ఈ క్రమంలో నాబార్డ్ విడుద‌ల చేసిన‌ ఫలితాల్లో గ్రేడ్‌-ఏ మేనేజరు ఉద్యోగం సాధించాడు. ఇలా ఏడాది వ్యవధిలో ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి ప్రశంసలు పొందాడు. ర‌మేష్ ప‌ట్టుద‌ల‌.. పోరాటం నేటి యువ‌త‌కు ఎంతో స్ఫూర్తినిస్తుంది. 

#Tags