APPSC Polytechnic Lecturers Jobs Notification 2023 : ఏపీపీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులకు అంటే..?
ఇప్పుడు తాజా ఏపీపీఎస్సీ 99 లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్) కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ Group1 &2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
దరఖాస్తు వివరాలు ఇవే..
ఈ ఉద్యోగాలకు జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 18న రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని APPSC స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీలకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అర్హతలు- ఎంపిక విధానం :
ఆయా విభాగాల్లో అధ్యాపక పోస్టులను బట్టి అభ్యర్థులు బీటెక్/ఎంటెక్/తదితర కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. జోన్లవారీగా జోన్-1: 11 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 33 పోస్టులు, జోన్-4: 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.
రాతపరీక్ష విధానం ఇవే..
ఈ ఉద్యోగాలకు మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్థాయి) 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2 అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్క ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒకప్రశ్నలకు 2 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే..
విభాగాలవారీగా ఖాళీలు:
☛ ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
☛ ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
☛ బయోమెడికల్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
☛ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్: 12 పోస్టులు
☛ సిరామిక్ టెక్నాలజీ: 01 పోస్టు
☛ కెమిస్ట్రీ: 08 పోస్టులు
☛ సివిల్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
☛ కంప్యూటర్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
☛ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 10 పోస్టులు
☛ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
☛ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 01 పోస్టు
☛ ఇంగ్లిష్: 04 పోస్టులు
☛ గార్మెంట్ టెక్నాలజీ: 01 పోస్టు
☛ జియోలజీ: 01 పోస్టు
☛ మ్యాథమెటిక్స్: 04 పోస్టులు
☛ మెకానికల్ ఇంజినీరింగ్: 06 పోస్టులు
☛ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
☛ మైనింగ్ ఇంజినీరింగ్: 04 పోస్టులు
☛ ఫార్మసీ: 03 పోస్టులు
☛ ఫిజిక్స్: 04 పోస్టులు
☛ టెక్స్‌టైల్ టెక్నాలజీ: 03 పోస్టులు
మొత్తం : 99