AP Govt Jobs Notifications 2024: యువత ‘కొలువు’ దీరనున్న వేళ..!

సాలూరు: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం తీసుకువచ్చారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు బుధవా రం ఆయన సాక్షితో ఫోన్‌లో మాట్లాడారు.

క్యాబినెట్‌ సమావేశంలో 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాలు, అటవీశాఖలో 689 ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై క్యాబినెట్‌లో ఆమోదం లభించిందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తోందని, ముఖ్యమంత్రి జగన్‌మోహ న్‌రెడ్డి గొప్ప పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.

చదవండి: AP DSC Notification 2024: ఈ జిల్లాలో భర్తీ కానున్న 712 ఉపాధ్యాయ పోస్టులు..

విద్యకు సంబంధించి అనేక సంస్కరణలు చేసి విద్యాశాఖలో అన్ని విభాగాలకు సంబంధించి ప్రాథమిక టీచర్లు, సబ్జెక్టు టీచర్లు తదితర వర్గాల వారీగా గుర్తించి 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్న విషయాన్ని యువత గుర్తించాలని పిలుపునిచ్చారు. నియమనిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన అత్యంత పారదర్శకంగా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. 1998 డీఎస్పీ, 2018 డీఎస్పీ, 2008లో మిగిలిన ఉపాధ్యాయ ఉద్యోగాలతో కలిపి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 2019 నుంచి నేటివరకు సుమారు 14,209 ఉద్యోగాలను విద్యాశాఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భర్తీ చేశార ని తెలిపారు. జగనన్న పాలనలో 2 లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ల ద్వారా కలిపి సుమారు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు యువతకు లభించాయన్నారు. గతంలో 5 ఏళ్ల పాలనలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని ఉద్యోగాలను ఏ ముఖ్యమంత్రీ భర్తీచేయలేదన్నారు.

చదవండి: Forest Department Jobs 2024: అటవీశాఖలో 689 ఉద్యోగాలు.. దీంతో పాటు భ‌ర్తీ చేయ‌నున్న వివిధ పోస్టులు ఇవే..

జగనన్న పాలనలో ఇప్పటికే గ్రూప్‌ 1 ఉద్యోగాలు భర్తీ చేశారని మళ్లీ గ్రూప్‌ 1, 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని, వాటికి త్వరలో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. జగనన్న పాలనలో పోలీస్‌శాఖలో ఉద్యోగాల నియామకాలు జరిగాయని, మళ్లీ ఆ శాఖలో మరిన్ని ఉద్యోగాల నియామకం జరగనుందని చెప్పారు. వైద్యశాఖలో 60 వేలకుపైగా, వేలాదిగా పోలీసు, గిరిజనశాఖ, పంచాయతీరాజ్‌, ఆర్టీసీ తదితర శాఖల్లో ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. తాజాగా అటవీశాఖలో 689 పోస్టులు భర్తీ చేయనున్నామని, మరో వైపు జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, డిప్లమోకాలేజ్‌ల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారని తెలిపారు.

#Tags