Andhra Pradesh: పాత జోనల్‌ విధానంలో మార్పులు

సాక్షి, అమరావతి: పాత జోనల్‌ విధానంలో మార్పులు చేసి కొత్త జిల్లాలతో కొత్త జోన్లు, మల్టీజోన్‌ ఏర్పాటుచేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు.
పాత జోనల్‌ విధానంలో మార్పులు

రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత, జోనల్‌ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉన్నందున.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై ఆగస్టు 4న రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కొత్త జోన్లు, మల్టీజోన్‌ ఏర్పాటుచేసేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల (1975)కు సవరణ చేసేందుకు ప్రతిపాదిత అంశంపై సీఎస్‌ సమీక్షించారు.

చదవండి: ఉద్యోగుల విభజన విధివిధానాలపై విద్యాశాఖ తర్జనభర్జన

స్థానికత, ప్రతిపాదిత నూతన జోనల్‌ విధానం తదితర అంశాలపై సర్వీసెస్‌ శాఖ కార్యదర్శి పి. భాస్కర్‌ వివరించారు. ఈ సమావేశంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సీహెఎచ్‌ హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: కొత్త జోన‌ల్ ప్రకార‌మే ఉద్యోగుల విభ‌జ‌న.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే వారికి ఈ అవకాశం..

#Tags