Good News For TS TET Candidates 2024 : గుడ్‌న్యూస్‌.. ఇక‌పై ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్షలు ఇలా.. టీచర్లు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌, డిసెంబర్‌ నెలల్లో తప్పనిసరిగా టెట్‌ జరిగేలా నిర్ణయం తీసుకున్నది.

☛ తెలంగాణ డీఎస్సీ-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎన్ని సార్లు అయినా రాసుకోవచ్చు..
టెట్ పరీక్షను అభ్యర్థులు ఎన్ని సార్లు అయినా రాసుకోవచ్చని స్పష్టం చేసింది.
డీఎస్సీ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండు సార్లు టెట్‌ నిర్వహిస్తారు. ప్రస్తుతం టెట్‌ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టనుండగా, అంతకుముందే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్సీటీఈ) గతంలోనే ఏటా రెండుసార్లు ఏటా నిర్వహించాలని ఆదేశించింది. అంతే కాకుండా టెట్‌ గడువును 7 ఏండ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించింది.

 Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

టీచర్లు కూడా టెట్‌కు..
గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారు.. అలాగే స్కోర్‌ పెంచుకోవాలనుకొనే వారు.. కొత్తగా బీఈడీ, డీఐఈడీ వంటి కోర్సులను పూర్తిచేసిన వారు మాత్రమే టెట్‌ రాసేవారు. ఇప్పుడు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు పేపర్ 2లో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉన్నది. దీంతో టీచర్లు కూడా టెట్‌కు పోటీపడనున్నారు. దీంతో టెట్‌కు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. టీచ‌ర్లు పదోన్నతులు పొందే వారికి ఎక్కువసార్లు టెట్‌ రాసుకొనే వెసులుబాటు కలగనున్నది. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉన్న విష‌యం తెల్సిందే.

#Tags