AP TET 2024 Results: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఏపీ టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్‌ చేశారు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 2,67,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,35,907 మంది అభ్యర్థులు హాజరయ్యారు.  మార్చి 14నే ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ ఉండటంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది.

AP DSC -2024 Notification : ఏపీ డీఎస్సీ-2024 పై కీల‌క నిర్ణయం.. జూలై 1వ తేదీ నుంచి..

అయితే నేడు రిలీజ్‌ చేయడంతో అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయం తెలిసిందే. 

AP TET results 2024.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/ను క్లిక్‌ చేయండి
  • హోంపేజీలో కనిపిస్తున్న AP TET results లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ వివరాలు ఎంటర్‌ చేయండి
  • తర్వాతి పేజీలో మీకు టెట్‌ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

#Tags