AP Police Constable Jobs Recruitment 2024 : బ్రేకింగ్ న్యూస్.. త్వరలోనే భారీగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తాం ఇలా.. డీజీపీ
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
మొత్తం ఎన్ని కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలపై కూడా డీజీపీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీకి త్వరలోనే విధివిధానాలను రూపొందించే అవకాశం ఉంది. నేడు రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. అర్హులైన పోలీసులకు త్వరలోనే పదోన్నతులు కూడా ఇస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకొచ్చారు.
➤☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
#Tags