Job Mela Tomorrow: శ్రీకాకుళంలో రేపు జాబ్‌మేళా

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణ కేంద్రం వేదికగా ఈ నెల 17వ తేదీన జాబ్‌మేళా జరగనుందని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. శనివా రం ఉదయం 10.30 గంటల నుంచి ఈ మేళా జరగనుందని చెప్పారు. క్యాలిబర్‌ కంపెనీలో వివిధ హోదాల్లో 80 పోస్టు లు, ఫ్యూచర్‌ మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో 70 పోస్టుల ను భర్తీ చేసేందుకు ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి కనీసం ఇంటర్మీడియెట్‌ ఆపైన కోర్సులు కలిగిన గల యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైనవారికి ఆకర్షణీయమైన జీతంతోపాటు ఇతర రాయితీలు అందజేస్తాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన యువత తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని కొత్తలంక సుధ కోరారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

చదవండి: Free training: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఎక్క‌డంటే?

#Tags