Guntur Medical College Released Merit List: కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గురువారం విడుదల చేశారు.
ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ధ్రువవపత్రాలతో అందజేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.టి.కె.రెడ్డి తెలిపారు.
ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు వైద్య కళాశాల నోటీసు బోర్డులో, గుంటూరు.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
#Tags