Andhra Pradesh Jobs: ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 300 ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హులైన అ‍భ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 300
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్‌ అసిస్టెంట్లు- 100 పోస్టులు
2. డేటా ఎంట్రీ ఆపరేటర్లు- 100 పోస్టులు
3. హెల్పర్లు-100 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా లైఫ్ సైన్స్‌లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అగ్రికల్చర్‌లో డిప్లొమా లేదా ఏదైనా రంగంలో బ్యాచిలర్స్ డిగ్రీ/కంప్యూటర్ అప్లికేషన్‌లో పీజీ డిప్లొమా లేదా పదో తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 40 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్‌ విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన అన్ని పత్రాలతో పాటు "ది డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయిస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్‌, జర్నలిస్ట్ కాలనీ. నిప్పో దగ్గర, వేదయపాలెం, నెల్లూరు - 524003కు ఫార్వార్డ్ చేయాలి.

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 24, 2024

#Tags