Gurukul Students Ranks: ఇంటర్‌లో గురుకుల విద్యార్థులు ప్రతిభ..

నిన్న విడుదలైన ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో ఈ గురుకుల విద్యార్థినులు ర్యాంకులు సాధించారు..

 

రాజమహేంద్రవరం రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాలలో బొమ్మూరులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సీనియర్‌ ఇంటర్‌ బైపీసీ విద్యార్థిని బుంగా ఈఏ జాస్మిన్‌ 971 మార్కులు సాధించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులలో జాస్మిన్‌ ఒకరు.

AP Intermediate Results 2024 :ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థులు సత్తా

గురుకుల కళాశాలలో జాస్మిన్‌ ప్రథమ స్థానం సాధించగా, ఎంపీసీ విభాగంలో ఐ.స్ఫూర్తి 944 మార్కులతో ద్వితీయ స్థానం, ఎన్‌.లక్ష్మీ 943 మార్కులతో తృతీయస్థానం సాధించారు. సీనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ విభాగంలో 75 మంది పరీక్షకు హాజరుకాగా 74 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో తొమ్మిది మంది 900 మార్కులు పైన సాధించారని ప్రిన్సిపాల్‌ ఏ.వాణికుమారి తెలిపారు.

PUC Ranker: పీయూసీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన యువతి..

#Tags