Students Scores: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా 22వ స్థానంలో.. ఉత్తీర్ణత సాధించిన కళాశాలలు ఇవే..

నిన్న ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సంఖ్య నుంచి వెల్లడించారు. అలాగే, ఫలితాల్లో పొందిన ఉత్తీర్ణతకు అన్నమయ్య జిల్లాకు ఈ స్థానాన్ని ప్రకటించారు..

రాయచోటి: ఇంటర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో అన్నమయ్య జిల్లా 69 శాతం ఉత్తీర్ణతతో 22వ స్థానంలో నిలిచింది. అన్నమయ్య జిల్లా నుంచి మొదటి, రెండు సంవత్సరాల్లో ఉన్న 26,638 మంది విద్యార్థులకు 25,249 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రభుత్వ కళాశాలల నుంచి 10,389 మందికి 9829 మంది పరీక్షలు రాయగా అందులో 6073 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు కళాశాలలో 16,333 మందికి 15,420 మంది హాజరవ్వగా 9173 మంది పాసయ్యారు. మొత్తం మీద జిల్లాలో 15,246 మంది ఉత్తీర్ణత సాధించి 69 శాతంతో రాష్ట్రంలో 22వ స్థానాన్ని పొందారు. మార్చినెల 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి.

PhonePe: భారతదేశం, నేపాల్ మధ్య యుపీఐ చెల్లింపులు..!

ఈ పరీక్షలలో అన్నమయ్య జిల్లా నుంచి 25,249 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం 12,978 మంది, రెండో సంవత్సరం 10,384 మంది, ఒకేషనల్‌ మొదటి సంవత్సరం 1045, రెండో సంవత్సరంలో 842 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో కూడా బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. మొదటి సంవత్సరంలో బాలురు 43 శాతం ఉత్తీర్ణత కాగా బాలికలు 62 శాతం, రెండో సంవత్సరంలో బాలురు 62 శాతం, బాలికలు 75 శాతం, ఒకేషనల్‌ పరీక్షల్లో బాలురు ఫస్టీయర్‌ 47 శాతం, బాలికలు 66 శాతం, సెకండియర్‌లో బాలురు 56 శాతం, బాలికలు 79 శాతం ఉత్తీర్ణత సాధించారు.

AP Inter Results: ఇంటర్‌ ఫలితాలు.. జిల్లాలవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా..

● ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేది నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించనున్నారు.

ఉత్తమ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు..

శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షలలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు.

● మదనపల్లి బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఇంగ్లీష్‌ మీడియం)లో రెండో సంవత్సరం ఎంపీసీకి చెందిన ఎస్‌.తహుర సమర్‌ 1000 మార్కులకు 979 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.

● మదనపల్లె బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఇంగ్లీష్‌ మీడియం)లో బైపిసి విద్యార్థిని గీతా మాధురి 1000 మార్కులకు గాను 964 మార్కులు సాధించింది.

● మదనపల్లె బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఇంగ్లీష్‌ మీడియం)లో సీఈసీ విద్యార్థిని ఎస్‌.సమీర కౌషార్‌ 1000 మార్కులకు గాను 951 మార్కులు రాబట్టింది.

AP Intermediate Toppers: ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌.. వీళ్ల లక్ష్యమిదేనట

● రాయచోటి బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఇంగ్లీష్‌ మీడియం)లో రెండో సంవత్సరం హెచ్‌ఈసీ విద్యార్థిని కుష్‌బూర్‌ 1000 మార్కులకు 964 మార్కులు సాధించింది.

● మదనపల్లె బాలికల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఇంగ్లీష్‌ మీడియం)లో మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని షేక్‌ సబుల్‌ ఫిర్‌దోస్‌ 440 మార్కులకు గాను 431 మార్కులు సాధించింది.

● రాయచోటి బాలుర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(ఇంగ్లీష్‌ మీడియం)లో బైపీసీ విద్యార్థి షేక్‌ అరిఫుల్లా 440 మార్కులకు 431 మార్కులు సాధించాడు.

Girl Escapes Child Marriage, Tops AP Inter Exams: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్‌గా, ఐపీఎస్‌ కావడమే లక్ష్యంగా..

● కలికిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(ఇంగ్లీష్‌ మీడియం)లో సీఈసీ విద్యార్థిని సి.రెడ్డి హేమావతి 500 మార్కులకు 473 మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకున్నారు.

● గుర్రంకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(ఇంగ్లీష్‌ మీడియం)లో ఎంపీసీ విద్యార్థిని షేక్‌ నబీద 470 మార్కులకు 453 మార్కులు సాధించింది.

Intermediate Rankers: విద్యార్థుల ప్రతిభకు ప్రిన్సిపాల్‌ అభినందనలు..

ఫస్టియర్‌ బాలురు: 6188 మంది పరీక్షలు రాయగా అందులో 2678 మంది ఉత్తీర్ణత సాధించి 43 శాతంగా రాణించారు.

బాలికలు: 6790 మంది పరీక్షలకు హాజరు కాగా 4208 మంది ఉత్తీర్ణత సాధించి 62 శాతంగా నిలిచారు.

సెకండీయర్‌ బాలురు: 4908 మంది పరీక్షలు రాయగా అందులో 3039 మంది ఉత్తీర్ణత సాధించి 62 శాతంగా రాణించారు.

బాలికలు: 5476 మంది పరీక్షలకు హాజరు కాగా 4114 మంది పాసై 75 శాతంగా రాణించారు.

Inter Fees: అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు.. ఫీజుల తీరు ఇలా..

ఫస్టీయర్‌ ఒకేషనల్‌ బాలురు: 407 మంది పరీక్షలు రాయగా అందులో 192 మంది ఉత్తీర్ణత సాధించి 47 శాతంగా రాణించారు.

బాలికలు: 638 మంది పరీక్షలకు హాజరు కాగా 423 మంది ఉత్తీర్ణత సాధించి 66 శాతంగా నిలిచారు.

సెకండీయర్‌ ఒకేషనల్‌ బాలురు:

311 మంది పరీక్షలు రాయగా అందులో 174 మంది ఉత్తీర్ణత సాధించి 56 శాతంగా రాణించారు.

బాలికలు: 531 మంది పరీక్షలకు హాజరు కాగా 418 మంది పాసై 79 శాతంగా రాణించారు.

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా,ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి..  

#Tags