AP Inter Public Exams Results 2024 Date : ఏపీ ఇంటర్‌ ఫలితాల విడుద‌ల‌పై క్లారిటీ ఇదే.. రిజ‌ల్డ్స్ ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంట‌ర్‌ ఫస్టియర్‌, సెకండియర్ పబ్లిక్ ప‌రీక్ష‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఇంట‌ర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇప్పుడు జవాబు పత్రాల మూల్యాంకనంను పునఃపరిశీలన చేయనున్నారు. అనంతరం మార్కులను డిజిటల్‌గా నమోదు చేస్తారు. 

అన్ని అనుకున్న‌ట్టు కుదిరితే.. ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకే సారి.. ఏప్రిల్‌ 15వ తేదీలోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది.ఈ  మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ విని­యో­గం, ప్రతి మూల్యాంకన కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తారు. ఏపీ ఇంట‌ర్‌ ఫస్టియర్‌, సెకండియర్ పబ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

మరోసారి పునఃపరిశీలన చేసేందుకు..

జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ గ‌త ఆదివారంతో ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారంరోజులు సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన విష‌యం తెల్సికందే.

#Tags