AP Intermediate Pass Percentage List: ఇంటర్ ఫలితాలు విడుదల, గతేదితో పోలిస్తే ఈసారి పెరిగిన ఉత్తీర్ణత
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు.ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 67 శాతంగా ఉండగా, సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78 శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గడిచిన 7 ఏళ్లలో ఇంటర్ ఫలితాల పాస్ పర్సంటేజ్‌లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్‌లు
1. 2018- 62%
2. 2019- 60%
3. 2020- 59%
4. 2021-100%
5. 2022- 54%
6. 2023-61%
7. 2024- 67%
ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్‌లు
1. 2018- 69%
2. 2019- 68%
3. 2020- 59%
4. 2021-100%
5. 2022- 61%
6. 2023-72%
7. 2024- 78%గా ఉన్నాయి.
#Tags