AP Intermediate Results Live Updates: ఇంటర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

AP Intermediate Results Live Updates:

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో కృష్ణా టాప్‌, సెకండియర్‌ ఫలితాల్లోనూ కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 
రెండో స్థానంలో గుంటూరు జిల్లా నిలవగా,
మూడో స్థానంలో ఎన్టీఆర్‌ జిల్లా నిలిచింది. 

  • ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం 67 శాతం
  • సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం 78 శాతం
  • ఒకేషనల్‌లో 71 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో..

  1. కృష్ణా జిల్లా 84%తో మొదటి స్థానంలో నిలిచింది. 
  2. 81%తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో 
  3. 79%తో  ఎన్టీఆర్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 

సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో..

  1. 90%తో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 
  2. 87%తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది
  3. ఆ తర్వాతి స్థానంలో 87%తో NTR జిల్లా నిలిచింది.

మొత్తం 10. 53 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి. ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం ఉన్నట్లు సౌరభ్‌ గౌర్‌ పేర్కొన్నారు.

 

ఇంటర్‌ ఫలితాల కోసం https://resultsbie.ap. gov.in/ డైరెక్ట్‌ లింక్‌ క్లిక్‌ చేయండి. మీ రూల్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అయి, ఫలితాలను చెక్‌ చేసుకోండి.


ఫెయిలైనా.. అలాంటి నిర్ణయాలు వద్దు
ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పాసయిన విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు అభినందనలు తెలిపింది. ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయాలని, ఫెయిల్‌ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలని పేర్కొంది.  కొందరు విద్యార్ధులకు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజీ యాజమన్యాలు విద్యార్ధులకు అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

మార్చి ఒకటి నుంచి  20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. ఫలితాలను https://resultsbie.ap. gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్‌ విద్యామండలి తెలిపింది.

 ఏపీ ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల 2024 ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.

>> Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు..

#Tags