Intermediate Counselling: నేడు గురుకుల‌ ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్‌..

గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు నేడు కౌన్సెలింగ్‌ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐటీడీఏ పీవో శుభం బన్సల్‌ తెలిపారు..

సీతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో శుభం బన్సల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట బాలికలు, బాలురు, పెద్దమడి బాలుర ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఒకేషనల్‌ గ్రూపులైన ఏఅండ్‌టి, సీజీఏలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ స్థానిక బాలుర జూనియర్‌ కళాశాలలో ఉంటుందన్నారు.

Medical College Development: వైద్య క‌ళాశాల అభివృద్ధిలో ఏపీ సీఎం కృషి..

విద్యార్థులు టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్‌ జిరాక్స్‌, 6 పాస్‌పోర్ట్‌ ఫొటోలు, మూడు జిరాక్స్‌ సెట్లు తీసుకుని కౌన్సెలింగ్‌ సెంటర్‌కు ఆ రోజు ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని స్పష్టం చేశారు.

Certificate Courses: వ్యవసాయ విద్యకు సర్టిఫికెట్‌ కోర్సులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

#Tags