TET Cum DSC 2024 Notification : ఇలా చేస్తే.. కొత్త వారికి డీఎస్సీ రాసుకునేందుకు మరో అవకాశం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం కోసం మెగా డీఎస్సీ నిర్వహించడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అయితే దీనితో పాటు టెట్‌ కూడా నిర్వహిస్తే మరింతమందికి ఉపయోగంగా ఉంటుందని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ జ‌న‌వ‌రి 24వ తేదీన (బుధవారం) ఒక ప్రకటనలో కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించడానికి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

☛ చదవండి: స్కూల్‌ అసిస్టెంట్‌ సాధించాలంటే.. సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ సాగించండిలా..

కొత్త వారికి డీఎస్సీ రాసుకునేందుకు మరో అవకాశం..

రాష్ట్రంలో లక్షలాది మంది టెట్‌ కోసం వేచి చూస్తున్న తరుణంలో వారి నుంచి వస్తున్న విన్నపాల మేరకు టెట్‌ కమ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, తద్వారా కొత్త వారికి డీఎస్సీ రాసుకునేందుకు మరో అవకాశం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో డీఎస్సీ బ్యాక్‌లాగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి అనివార్యకారణాల వల్ల రద్దు చేశారని, ఈ మేరకు డీఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు.

☛టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

☛ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags