292 హైస్కూల్ ప్లస్లకు పీజీటీలు
హైస్కూల్ ప్లస్‌లుగా అప్ గ్రేడ్ అయిన ఈ స్కూళ్లలో 11, 12 తరగతులను నిర్వహిస్తారు. ఈ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ విద్యకు సంబంధించిన బైపీసీ, ఎంపీసీ, సీఈసీ కోర్సులు ఉంటాయి. ఈ తరగతుల బోధన కోసం Post Graduate Teachers (PGT)ను సర్దుబాటు చేయనున్నారు. అర్హత గల స్కూల్ అసిస్టెంట్లకు పీజీటీలుగా అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కో కోర్సుకు సబ్జెక్టు టీచర్ ఒకరు, ఇంగ్లిష్, తెలుగు, హిందీ లాంగ్వేజ్ టీచర్లను నియమించనున్నారు. వీరికి సంబంధించిన విద్యార్హతలను, ప్రొఫెషనల్ అర్హతలను పాఠశాల విద్యాశాఖ జీవో ద్వారా తెలియజేసింది. అర్హతలు ఉన్న స్కూల్ అసిస్టెంటు టీచర్ల నియామకానికి సంబంధించిన విధివిధానాలను కూడా ఆ జీవోలో పేర్కొంది.
చదవండి:
Teaching jobs: కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. వాక్-ఇన్ తేదీలు ఇవే..
Army School Teacher: టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు, అర్హతల వివరాలు ఇలా..