KGBV: కేజీబీవీల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2022–23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి మే 5న ఒక ప్రకటనలో తెలిపారు.
కేజీబీవీల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మే 6 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్‌ (బడిమానేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్‌ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల బాలికలు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. దీంతోపాటు సంబంధిత కేజీబీవీల నోటీసు బోర్డులో నేరుగా చూడవచ్చని తెలిపారు. సమస్యలు, సందేహాలకు 94943 83617, 94907 82111 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

#Tags