కోచ్‌ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల సంయుక్త నిర్వహణలోని స్పోర్ట్స్‌ స్కూళ్లలో కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శాప్‌ ఎండీ ఎన్‌.ప్రభాకరరెడ్డి సెప్టెంబర్‌ 9న ఒక ప్రకటనలో తెలిపారు.
కోచ్‌ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆరు రెసిడెన్షియల్, ఆశ్రమ స్పోర్ట్స్‌ స్కూళ్లలో వివిధ క్రీడాంశాలకు సంబంధించి 23 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు సంతకం చేసిన సంబంధిత ధ్రువపత్రాలను 19వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు kisce.ap@gmail.comకు మెయిల్‌ చేయాలని సూచించారు. వివరాలకు శాప్‌ వెబ్‌సైట్‌ sports.ap.gov.inను సంప్రదించాలన్నారు. 

చదవండి: Asia Cupలో భారత్‌ కోచ్‌గా VVS లక్ష్మణ్‌

వివిధ క్రీడాంశాలకు సంబంధించి అవసరమైన కోచ్‌లు 

పాఠశాల

క్రీడాంశం

సీతంపేట (బాలురు), పార్వతీపురం మన్యం

ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్‌

భద్రగిరి (బాలికలు), పార్వతీపురం మన్యం

అథ్లెటిక్స్, హాకీ, జూడో, వెయిట్‌లిఫ్టింగ్‌

ముసురుమిల్లి (బాలురు), తూర్పుగోదావరి

ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్‌

వైజీ పాలెం (పీటీజీ–బాలురు), ప్రకాశం జిల్లా

ఆర్చరీ, అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్‌

మహానంది (బాలికలు), నంద్యాల జిల్లా

ఆర్చరీ, అథ్లెటిక్స్, టేబుల్‌ టెన్నిస్‌

గొల్లలదొడ్డి (బాలురు), అనంతపురం జిల్లా

అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్‌ 

#Tags