FIDE Ranking: భారత నంబర్ వన్‌గా అర్జున్
![Arjun Erigaisi](/sites/default/files/images/2024/04/10/arjun-erigaisi-1712754191.jpg)
కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ ఛెస్గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్‌గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. గత ఏడాది సెప్టెంబర్1న తమిళనాడు గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత కొత్త నంబర్‌వన్‌గా నిలిచాడు.
చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)