School Education Department: ఏపీ మోడల్ విద్యపై కసరత్తు

సాక్షి, అమరావతి: ఏపీ మోడల్ విద్యా విధానంపై ముసాయిదా రూపకల్పనకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పాఠ శాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు న‌వంబ‌ర్‌ 15న ఉపాధ్యాయ సం ఘాలతో చర్చలు జరిపారు.

జీవో 117 ద్వారా 4,731 ప్రాథమిక పాఠశాలల్లో 3 - 5 తరగతులను యూపీ, హైస్కూళ్లలో విలీనం చేయగా వీటిని తిరిగి పాత విధానంలోకి తెచ్చేందుకు మార్గదర్శకా లను రూపొందించనున్నారు.

ఇకపై అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలతో మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో షెడ్యూల్ ప్రకారం మే నెలలో పదోన్నతులు, బదిలీలు చేపట్టనున్నారు. బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో 20 మంది లోపు పిల్లలు ఉంటే ఒక ఎస్ఓటీని, 60 మంది పిల్లలుంటే ఇద్దరు ఎస్ఓటీలను, ఆపై ప్రతి 30 మంది విద్యార్థు లకు ఒక ఎస్ఓటీని నియమిస్తారు.

చదవండి: DSC 2024 Selected Candidates: కొత్త టీచర్లలో గుబులు!.. ధ్రువీకరణపత్రాల పునఃపరిశీలన..

మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయిస్తూ 120 మంది పిల్లలు కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టు కేటా యించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రాథమిక పాఠశాలలకు 1 : 30, ఉన్నత పాఠశాలలకు 1 : 35 చొప్పున విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ణయించనున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

యూపీ స్కూళ్లలో 6, 7, 8 తరగతుల విద్యార్థులు 30 మంది కంటే తక్కువ ఉంటే దాన్ని ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్ చేస్తారు. 60 మంది కంటే ఎక్కువ మంది ఉం టే ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు. ఉన్నత పాఠశాలలో 6 - 10 తరగతుల వరకు 75 మంది విద్యార్థులకు మించి ఉంటే హెచ్ ఎం, పీడీ పోస్టులను కేటాయిస్తారు.

ఏటా మే 31 నాటికి ఖాళీలను పరిగణనలోకి తీసుకొని బదిలీలు నిర్వహించి జూన్ ఒకటో తేదీన పాఠశాలలో చేరేలా ఉత్తర్వులిస్తారు. ప్రధానోపాధ్యాయులకు కనీ సం రెండు సంవత్సరాల సర్వీసు, గరిష్టంగా ఐదు సంవత్సరాల సర్వీసును... ఉపాధ్యాయులకు కనీసం రెండు సంవత్సరాల సర్వీసు, గరిష్టంగా 8 ఏళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకుంటారు.

#Tags