Andhra Pradesh: విద్యార్థికి నిఘంటువు.. ఆంగ్లం ఇక సులువు

మదనపల్లె సిటీ: ‘విద్యార్థులకు చదువే భవిష్యత్తు. భావితరాలకు ఆస్తి ఇస్తున్నామంటే అది చదువే’ అని సాక్షాత్తూ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెబుతున్న మాట. ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నీరుగారిపోయాయి.
విద్యార్థికి నిఘంటువు.. ఆంగ్లం ఇక సులువు

నేడు ఆ పరిస్థితి మారింది. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అన్నమయ్య జిల్లా 2213 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఈ ఏడాది జనగన్న విద్యా కానుక ద్వారా 17750 ఆంగ్ల డిక్షనరీలు ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో విద్యార్థి ఆంగ్ల పదాలు అర్థంగాక ఇబ్బంది పడ్డారు. ఇపుడు డిక్షనరీలు ఇవ్వడంతో పట్టు సాధిస్తున్నారు. విద్యార్థులలో పఠనాసక్తి పెంచేందుకు డిక్షనరీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

చదవండి:

AP Govt Schools: ఆంగ్లంలో చదువులు భేష్‌

Best English Teachers Awards: ఉత్తమ ఆంగ్ల ఉపాధ్యాయులకు అవార్డులు

TSBIE: ఇంటర్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌

#Tags