Ekalavya School: త్వరితగతిన ‘ఏకలవ్య’ భవన నిర్మాణం

హుకుంపేట: ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర కమిటీ జాయింట్‌ కమిషనర్‌ బిపిన్‌ చంద్ర రతుని పేర్కొన్నారు.

మండలంలో మట్టుజోరు పంచాయతీ నక్కలపుట్టులో ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం చేపట్టే స్థాలాన్ని డిసెంబ‌ర్ 12న‌ఆయన కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు.

చదవండి: Education: ప్రాంతీయ విద్యాకేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి స్వచ్ఛందంగా 11.87 ఎకరాలకు అందజేసిన రైతులను ఆయన అభినందించారు. వెంటనే పనులు చేపట్టేలే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజ్యలక్ష్మి, సర్పంచ్‌ సీదరి సాంబ పాల్గొన్నారు.

#Tags