Baseline Tests: విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్షలు

ఒంగోలు: జిల్లాలో 3, 4, 5 తరగతులు నిర్వహిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, విలీన ఉన్నత, విలీన హైస్కూలు ప్లస్‌లలో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ 10, 11 తేదీల్లో బేస్‌లైన్‌ టెస్టు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర సెప్టెంబర్ 8న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి టీచింగ్‌ ఎట్‌ది రైట్‌ లెవల్‌ బేస్‌లైన్‌ పరీక్షలు తెలుగు, గణితం పరీక్షలను ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించాలన్నారు. బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహణ, విధి విధానాలు, శాంపిల్‌ పరీక్ష పత్రాలను ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారి మెయిల్‌, వాట్సప్‌ గ్రూపునకు పంపామన్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2025 | బ్లూ ప్రింట్ 2025 | టెక్స్ట్ బుక్స్ 2024 |  ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఉపవిద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సెక్టోరల్‌ అధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ పాఠశాలల హెడ్మాస్టర్లు ఈ పరీక్షను 3, 4, 5 తరగుతులు నిర్వహిస్తున్న పాఠశాలలు అన్నింటిలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం ఫలితాలను వెబ్‌సైట్‌లో సకాలంలో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

#Tags