Skip to main content

Education: కుంటుపడుతున్న విద్యాభివృద్ధి

అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలులో అత్యంత కీలకమైన సమగ్ర శిక్షలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులు లేక పథకాల అమలు కుంటు పడు తోంది.
Stalling educational development

ఏఎంఓ, అసిస్టెంట్ ఏఎంఓలు, అలెస్కో, సీఎంఓ, జీసీడీఓ, ఏఎస్ఓ, ఐఈ కోఆర్డినేటర్ ను రీప్యాట్రేషన్ చేస్తూ గతనెల 31న కలెక్టర్ వినోద్ కుమార్ నిర్ణయం తీసుకు న్నారు. కలెక్టర్ ను తప్పుదోవ పట్టిస్తూ సమగ్ర శిక్ష నుంచి ఫైలు పెట్టడం వెనుక ఓ అధికారితో పాటు ఒక సీనియర్ అసిస్టెంట్ కీలకంగా A.P. సాండర్ డిస్ట్రిక్ట్ పాలెట్ వ్యవహరించారు.

ఫైలును నడిపిన విధానం చూస్తే ఆ అధికారి కక్షకట్టి మరీ వ్యవహరించి నట్లు స్పష్టమవుతోంది. గతంలో కలెక్టర్ ఆమోదం ద్వారానే వీరందరూ వచ్చారు. అయితే, నిబంధనలకు విరుద్ధమంటూ ఆ కలెక్టర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రస్తుత కలెక్టర్ కు ఫైలు పెట్టారు.

చదవండి: హెల్త్‌ వర్సిటీ, జేఎన్‌టీయూకే ఒప్పందం

ఇందులో ప్రతిలైనూ తప్పులతడకగానే ఉంది. రిలీవ్ ఫైలుపై కలెక్టర్ తో అర్ధరాత్రి సంతకం చేయించారు. సెక్టోరియల్ అధికారులను రిలీవ్ చేయకుం డానే కలెక్టర్ పేరుతో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయించారు. చివరకు తాను తీసుకోవాల్సిన సీనియర్ అసిస్టెంట్ల రిలీవ్ నిర్ణయం కూడా కలెక్టర్ కు ఫైలు పెట్టి తన చేతికి మట్టి అంట కుండా ఆయనపై తోసేశారు.

ఎవరు అడిగినా 'అది కలెక్టర్ నిర్ణయం.. నా చేతుల్లో ఏముందని' చెబుతూ వచ్చారు. అసలు విషయం కలెక్టర్ కు తెలిసిపోవడంతో సదరు అధికారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

దరఖాస్తులు సరే.. స్క్రూటినీ ఏదీ?

సెక్టోరియల్ అధికారుల పోస్టులకు 110 దరఖా స్తులు వచ్చాయి. ఆగ‌స్టు 9తో దరఖాస్తు గడువు ముగిసింది. ఆ వెంటనే స్క్రూటినీ చేపడతామని అధికారులు ప్రకటించారు. 20 రోజులు దాటినా ఇప్పటికీ అతీగతీ లేదు. వీటి గురించి పట్టించుకునేనాథుడే లేడు. అసంబద్ధ నిర్ణయాలతో అస్తవ్యస్తం.. సదరు అధికారి తీసుకున్న నిర్ణయాలతో జిల్లాలో సమగ్ర శిక్ష భ్రష్టు పడుతోంది. ఎస్పీడీ నిర్వహించే కాన్ఫరెన్సులు, వెబ్‌సైట్ లో డీపీసీ హోదాలో ఆ అధికారి హాజరైన సందర్భాలు వేళ్ల మీద లెక్కించొచ్చని సిబ్బంది చెబుతున్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం అమలు చేసే విద్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ సమగ్రశిక్ష ద్వారా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాంటి కార్యాలయాన్ని పర్యవేక్షణ అధికారులు లేనిదిగా మార్చారు. ఈ అధికారి తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో జిల్లాలో సమగ్ర శిక్ష భ్రష్టు పడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి పెడుతోందని డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు.

Published date : 29 Aug 2024 09:43AM

Photo Stories