AP 10th Class Students Success Stories : ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులంటే.. తక్కువ అంచనా వేస్తారు.. కానీ ఇప్పుడు మేము కార్పొరేట్‌కు దీటుగా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అదరగొట్టారు. వంద రోజుల ‘అనంత సంకల్పం’, స్లిప్పు టెస్ట్‌లు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పదో తరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంతో కార్పొరేట్‌కు ఏమాత్రమూ తీసిపోని విధంగా సత్తా చాటారు.
ap government school 10th class students success story

ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో లక్షలాది రూపాయలు డొనేషన్లు, ఫీజులు, యూనిఫాం, పుస్తకాల కోసం ఖర్చు చేస్తుంటారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందజేస్తూ చదువు చెబుతుండగా.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో రాణించారు.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించి అనంతపురంలోని పొట్టిశ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థి కడియాల సాయి అక్షయ్‌ 588 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే కుందుర్పి మండలం తెనగల్లు జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థిని కరణం రక్షిత 587, గుత్తి రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థిని కండ్లపల్లి హాసిని 587 మార్కులతో రెండోస్థానంలో నిలిచారు.

గతేడాదికంటే ఈసారి..

ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో గతేడాదికంటే ఈసారి ఫలితాల శాతం బాగా పెరిగింది. విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని టీచర్లు చెబుతున్నారు. ఏపీ మోడల్‌ స్కూళ్లలో గతేడాది 58.32 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 74.89 శాతం సాధించారు. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో గతేడాది 82.94 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 91.82 శాతం సాధించారు.

AP 10th Class Results 2023 : 12 ఏళ్లకే టెన్త్‌ పాసైన విద్యార్థి.. ఈ అమ్మాయికి వచ్చిన మార్కులు ఎన్నంటే..?

ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో గతేడాది 61.03 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 85.23 శాతం సాధించారు. ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో గతేడాది 19.50 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 51.34 శాతం సాధించారు. కేజీబీవీల్లో గతేడాది 36.77 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 58.50 శాతం సాధించారు. జెడ్పీ స్కూళ్లలో గతేడాది 27.36 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 47.40 శాతం సాధించారు. మునిసిపల్‌ స్కూళ్లలో గతేడాది 33.30 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 51.01 శాతం సాధించారు. ప్రభుత్వ స్కూళ్లలో గతేడాది 31.07 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 47.50 శాతం సాధించారు.

ప్రభుత్వ స్కూళ్లు అంటే...

‘ప్రభుత్వ స్కూళ్లలో ట్రైన్డ్‌ టీచర్లు కావడంతో పిల్లలకు మార్కులే కాకుండా నైపుణ్యాలు పెంపొందించేలా చేస్తారు. సహజంగా ప్రభుత్వ స్కూళ్లు అంటే తక్కువ అంచనా వేస్తారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లు మరింత నాణ్యతగా ఉన్నాయి. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఢోకా ఉండదు’
  ఇదీ అనంతపురం నగరంలోని పొట్టిశ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 588 మార్కులు సాధించిన విద్యార్థి సాయి అక్షిత్‌ తండ్రి కడియాల విశ్వనాథం అభిప్రాయం.

☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

#Tags