AP SSC Exam Fee: 10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే 10వ తరగతి పరీక్షలకు గతంలో అనుత్తీర్ణత పొంది ప్రస్తుతం ప్రైవేటుగా హాజరుకాగోరు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేదీని పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీ శ్యామ్‌సుందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 10వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 16 వరకు, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 23 వరకు, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఈ తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉంటే తరువాత వచ్చే రోజున ఫీజు చెల్లించవ్చని పేర్కొన్నారు.

చదవండి: AP 10th Class Study Material

#Tags