ZP High School: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా

ఏటా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకుని ఉపాధ్యాయులందరమూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. గత మూడేళ్లుగా మా పాఠశాల విద్యార్థులే మండల టాపర్లుగా నిలుస్తుండడం ఇందుకు నిదర్శనం. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.63 లక్షల వ్యయంతో పాఠశాలలో అధునాతన సౌకర్యాలు కల్పించాం. ఈ విషయాన్ని గుర్తించిన చాలా మంది ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అడ్మిషన్లు పొందుతున్నారు. చదువులతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.
– షఫియా, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌, నరసాపురం
 

చదవండి: ZP High School: అటు చదువులోను.. ఇటు క్రీడల్లోనూ నంబర్‌ వన్‌

#Tags