TSPSC AEE Selection list 2024 : ఏఈఈ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా ప్రకటించండి.. లేదంటే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ– సివిల్‌) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

మొత్తం 1180 ఏఈఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటించటంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జాబితాను వెల్లడించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటూ పరీక్ష రాసినవారు జూలై 3వ తేదీన (బుధవారం) కేటీఆర్‌ను కలిశారు. టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌ ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

☛ KTR Demands Job Calendar 2024 : ఏడు నెలలు పూరైంది.. ఇంకెప్పుడు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు..?

సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి.. కానీ..
గత ప్రభుత్వ హయాంలోనే ఏఈఈ (సివిల్‌) రాత పరీక్ష నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేసిందన్నారు. 22 నెలల క్రితం నోటిఫికేషన్‌ విడుదలై పరీక్ష జరిగిందని, ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన జాబితాను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా విడుదల చేయడం లేదని తెలిపారు.

➤ Telangana Job Calendar 2024 : జాబ్ క్యాలెండర్ 2024 విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే.. ఇంకా పోస్టుల సంఖ్య పెంపుకు..!

#Tags