CSIR UGC NET: జాయింట్ సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ డిసెంబర్–2024.. దరఖాస్తులకు చివరితేది ఇదే..
ఈ పరీక్షను సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్‌ల్లో, యూనివర్శిటీల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే యూనివర్శిటీలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.
సబ్జెక్ట్‌లు: కెమికల్ సైన్సెస్,ఎర్త్,అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్; లైఫ్ సైన్సెస్; మ్యాథమేటì కల్ సైన్సెస్; ఫిజికల్ సైన్సెస్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి లేదా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్–ఎంఎస్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. ఓబీసీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్జ్‌జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు పొందాలి.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఫిబ్రవరి 2025 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్‌క్రిమిలేయర్)లకు మూడేళ్ల గరిష్ట వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.12.2024.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది: 31.12.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 01.01.2025 నుంచి 02.01.2025 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.12.2024
పరీక్షల తేదీలు: 16.02.2025 నుంచి 28.02.2025.
వెబ్‌సైట్: https://csirnet.nta.ac.in
>> EF EPI 2024: ఇంగ్లిష్ ప్రావీణ్యం అంతంతే.. అత్యద్భుతమైన ప్రావీణ్యం ఉన్న టాప్ 9 దేశాలు ఇవే..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |