Diploma Courses 2024 : మెడికల్‌ కాలేజీలో డిప్లొమా కోర్సులు

Diploma Courses 2024 : మెడికల్‌ కాలేజీలో డిప్లొమా కోర్సులు

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కాలేజీలో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ వైద్య, విద్య సంచాలకులు అనుమతించారని సిరిసిల్ల మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ శనివారం తెలిపారు. 2024–2025 విద్యాసంవత్సరానికి డీఏఎన్‌ఎస్‌(డిప్లొమా ఇన్‌ అనస్థీషియా టెక్నీషియన్‌), డీఈసీజీ(డిప్లొమా ఇన్‌ ఈసీజీ టెక్నీషియన్‌) పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల సీట్లను భర్తీ చేసేందుకు అనుమతులు లభించాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు, లేదా ఎంపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు, ఇతర గ్రూప్‌ అభ్యర్థులు సైతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు కాలేజీ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి వివరాలను ఈనెల 30లోగా అందించాలని సూచించారు.

ఇదీ చదవండి: 7545 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌... ఎప్పుడంటే...?

 

#Tags