Telangana Ekalavya Adarsha Gurukula Vidyalaya: ఆరో తరగతి ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం సీట్ల సంఖ్య: 23 విద్యాలయాల్లో 1380(690బాలురు,690బాలికలు)సీట్లు ఉన్నాయి.
అర్హత: గిరిజన, ఆదివాసీ గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రై»Œ కేటగిరీలకు చెందిన విద్యార్థులు అర్హులు. 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
వయసు: 31.03.2024 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు.
చదవండి: Admissions: ‘ఏకలవ్య’లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పరీక్ష విధానం: ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ(50 ప్రశ్నలు)-50 మార్కులు, అర్థమేటిక్(25 ప్రశ్నలు)-25 మార్కులు, లాంగ్వేజ్(25 ప్రశ్నలు)-25 మార్కులు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.03.2024
హాల్‌టిక్కెట్‌ల డౌన్‌లోడ్ తేది: పరీక్షకు ఒక వారం ముందు
పరీక్ష తేది: 21.04.2024.
వెబ్‌సైట్: https://tsemrs.telangana.gov.in/