Admissions Notification 2024 : అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదల..

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులైన డిప్లొమా అభ్యర్థులు పీజేటీఎస్‌ అగ్రి వర్శిటీ పరిధిలో బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ డిగ్రీ ప్రోగ్రామ్, బీటెక్‌(అగ్రి ఇంజనీరింగ్‌) డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
»    అగ్రి సెట్‌: మొత్తం సీట్ల సంఖ్య: 92
»    అర్హత: డిప్లొమా(అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ/ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌/ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌–2024: మొత్తం సీట్ల సంఖ్య: 08
»    అర్హత: డిప్లొమా (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 10.08.2024.
»    ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 12.08.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 24.08.2024(2.30 నుంచి 4.10 వరకు).
»    వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in

Jobs at NIMHANS : నిమ్‌హాన్స్‌లో గ్రూప్ ఏ, బీ, సీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు అర్హులు..

#Tags