ITI Admissions 2024 :ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తులు

ITI Admissions 2024 :ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తులు

చిత్తూరు :జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో రెండో విడత అడ్మి షన్లకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌ రవీంద్రరెడ్డి కోరారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ, 10 ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్‌ పొందే వెసులుబాటు ఉందన్నారు. www.iti. ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించవచ్చని వెల్లడించారు. రెండో విడతలో అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వ కళాశాలలకు 27, 28 ప్రైవేట్‌ కళాశాలలకు 29,30 తేదీల్లో సంప్రదించాలని సూచించారు.

Also Read:  AP TET Detailed Notification 2024

24లోపు ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు

పుంగనూరు : మైనారిటీ ఐటీఐలో ప్రవేశానికి ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ శ్రీనివాసులురెడ్డి సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఒక సంవత్సరం కోర్సుల్లో మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, ఫ్యాషన్‌డిజైనింగ్‌ ఉన్నాయన్నారు. రెండేళ్ల కోర్సుల్లో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్‌స్‌మన్‌ సివిల్‌, మోటారు వెహికల్‌ మెకానిక్‌ ఉన్నాయని వివరించారు. పూర్తి చేసిన దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని కోరారు. ఇతర వివరాలను కళాశాలలోనే సంప్రదించాలని సూచించారు.

#Tags