10th Class Results: సీబీఎస్‌ఈలో సత్త్తాచాటిన ఏకలవ్య మోడల్‌ పాఠశాల విద్యార్థులు

భద్రాచలంటౌన్‌: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన ఏకలవ్య మోడల్‌ పాఠశాలల విద్యార్థినులు సత్తా చాటారు.

మే 13న విడుదలైన టెన్త్‌ సీబీఎస్‌ఈ ఫలితాల్లో 415 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 విద్యాలయాలకు (ఖమ్మం–1, భద్రాద్రి కొత్తగూడెం–7)గాను 6 విద్యాలయాలు (ఈఎంఆర్‌ఎస్‌, గండుగులపల్లి, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, టేకులపల్లి, గుండాల) వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

చదవండి: Financial Assistance: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సాయం

ఈఎంఆర్‌ఎస్‌, సింగరేణి విద్యార్థి భూక్య రామ్‌చరణ్‌ 500 మార్కులను గాను 447 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. దీంతో భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ మే 14న‌ ఒక ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు.
 

#Tags