Degree Results: డిగ్రీ ఫలితాలు విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ ఐదు, ఆరు సెమిస్టర్‌ ఫలితాలను బుధవారం ఆ వర్సిటీ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. డిగ్రీ ఐదో సెమిస్టర్‌లో బీఎస్సీ, బీసీఏ కోర్సులు కలిపి మొత్తం 5,507 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదు, ఆరో సెమిస్టర్‌ ఇంటర్నషిప్‌ ఎవాల్యుయేషన్‌ ఫలితాలను వీటితో పాటు విడుదల చేశారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ కోర్సుల్లో మొత్తం 13,934 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 11,991 మంది (92.71 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్‌లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎంవీ లక్ష్మయ్య, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ జీవీ రమణ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ కె.శ్రీరాములు నాయక్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ సీహెచ్‌ కృష్ణుడు, సీఎం అనురాధ, డి.చంద్రమౌళిరెడ్డి, సీడీసీ కె.రాంగోపాల్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.చండ్రాయుడు, గోవిందరెడ్డి పాల్గొన్నారు.

చదవండి: JNTU Anantapur Results 2023: బీటెక్‌, బీ–ఫార్మసీ ఫలితాల విడుదల

#Tags