Medical Department: వైద్యారోగ్య శాఖలో రెగ్యులరైన ఉద్యోగుల జాబితా

ఏపీ సీఎం జగన్‌ ప్రభుత్వం కారణంగా వైద్యారోగ్య శాఖలో రెగ్యులర్‌ అయిన ఉద్యోగల జాబితా గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలో వారు తమ మాటలను వ్యక్తం చేశారు.

పాడేరు: తమ చిరకాల కోరికను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరవేర్చి మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని జిల్లా వైద్యారోగ్య ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శెట్టి నాగరాజు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా నిర్లక్షం చేసిందన్నారు.

TSPSC Group 2 Exams Dates 2024 : 783 పైగా గ్రూప్‌-2 ఉద్యోగాలు.. ప‌క్కాగా జాబ్ కొట్టాలంటే.. ప్రిప‌రేష‌న్ వ్యూహాం ఇలా..!

టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగిని కూడా రెగ్యులర్‌ చేయాలేదన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను గత టీడీపీ ప్రభుత్వం వంచనకు గురి చేసిందని విమర్శించారు. గురువారం విడుదల చేసిన రెగ్యులర్‌ అయిన ఉద్యోగుల జాబితాలో పాడేరు ఐటీడీఏ పరిధి వైద్యారోగ్య శాఖకు చెందిన సుమారు 80 మంది ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, వారి కుటుంబాలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామన్నారు.

WTO Ministerial Meeting: అబూ ధాబీలో జరిగిన డబ్ల్యూటీవో మంత్రివర్గ సమావేశం

#Tags