Free training in tailoring: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free training in tailoring

చంద్రగిరి: యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో మే 14(మంగళవారం) నుంచి 30 రోజుల మహిళలకు టైలరింగ్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్టు సంస్థ డైరెక్టర్‌ పీ.సురేష్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెల్లరేషన్‌ కార్డు కలిగి, తిరుపతి, చిత్తూరు జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ మహిళలు శిక్షణకు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలన్నారు.

శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు కూడా అందజేస్తామన్నారు. ఆసక్తిగల వారు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు.

వివరాలకు యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీ ణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్‌ (రాయల్‌ విక్టరీ స్కూల్‌ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్‌: 79896 80587, 94949 51289, 63017 17672 సంప్రదించాలన్నారు.

#Tags