Teacher jobs in 2023: ఉపాధ్యాయ ఖాళీలు 185.. చివరి తేదీ ఇదే..

సూర్యాపేట టౌన్‌: ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన 2017లో టీఆర్‌టీని నిర్వహించారు.
డీఎస్సీ నోటిఫికేషన్‌

ఆ తర్వాత ఉపాధ్యాయ నియమమకాలు లేకపోవడంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా శుక్రవారం టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా జిల్లాలో మొత్తం 185 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు మొదలయ్యాయి. డీఎస్సీ పరీక్ష రాయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో అర్హత సాధించాల్సి ఉండటంతో ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన టెట్‌ నిర్వహించనున్నారు.

Teacher job సాధిచండానికి సులభమైన మార్గం.. #sakshieducation

20వ తేదీ నుంచి దరఖాస్తులు

డీఎస్సీ రాసేందుకు అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్‌ 21వ తేదీ వరకు సంబంధిత ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 ఏళ్లు వయసు గలవారై ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(సీబీఆర్‌టీ) నవంబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు నిర్వహించనున్నారు.

TS DSC: Perspective in Education ముఖ్యమైన టాపిక్స్ ఇవే.. #sakshieducation

డీఎస్సీ ద్వారా భర్తీ..

ఇప్పటి వరకు టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ చెప్పింది. ఆ ప్రకారమే పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జిల్లాలో 185 పోస్టులను కేటగిరీల వారీగా విభజించేందుకు విద్యాశాఖ అధికారులు త్వరలో కసరత్తు ప్రారంభించనున్నారు.

DSCలో కొత్త Subject ఇదే.. Scoring subject ఏదంటే! #sakshieducation

గతంలో గుర్తించిన ఖాళీలు

జిల్లాలో 950 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 67వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే 3968 మంది ఉపాధ్యాయులు అవసరముండగా ప్రస్తుతం 3,224 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇంకా 744 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జీహెచ్‌ఎం 106, స్కూల్‌ అసిస్టెంట్‌లు 286, ఎస్‌జీటీలు 222, పీఈటిలు ముగ్గురు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 104, ఎల్‌పీటీలు 11, ఎల్‌పీహెచ్‌లు 12 మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్టు అధికారులు గతంలో గుర్తించారు.

 

DSC : Current Affairs లో జాతీయం, అంతర్జాతీయం & రాష్ట్రీయంలో వచ్చే ప్రశ్నలు ఇవే #sakshieducation

  • విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌
  • 20వ తేదీ నుంచి
  • దరఖాస్తుల స్వీకరణ
  • తక్కువ పోస్టులే ప్రకటించడంతో
  • అభ్యర్థుల్లో నిరాశ
  • నోటిఫికేషన్‌లో ఖాళీ పోస్టులు ఇలా
  • స్కూల్‌ అసిస్టెంట్లు 80
  • భాషా పండితులు 23
  • వ్యాయామ ఉపాధ్యాయులు 04
  • సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 78
  • మొత్తం 185

DSC Current Affairs: 18 Number తో వచ్చే బిట్స్ ఇవే.. #sakshieducation

#Tags