Telangana District Courts jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో అటెండర్, అసిస్టెంట్ ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 7వ తరగతి, 10వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈనెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం: Click Here
ఖాళీలు మరియు అర్హతలు
ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్: ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ పరిజ్ఞానం, టైపింగ్ స్పీడ్, ఫైల్ ప్రాసెసింగ్, మెయింటనెన్స్ స్కిల్స్ ఉండాలి.
ప్యూన్ / అటెండర్: 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు మరియు జీతం వివరాలు
వయస్సు: 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు, వికలాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీతం: ప్యూన్ ఉద్యోగాలకు ₹14,000/- మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹20,000/- చెల్లిస్తారు. ఎటువంటి అలవెన్సులు ఉండవు.
ఎంపిక విధానం
పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగాలు ఇస్తారు.
ఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్: 02 పోస్టులు
ప్యూన్ / అటెండర్: 02 పోస్టులు
దరఖాస్తు తేదీలు: 28 ఆగష్టు 2024 నుండి 9 సెప్టెంబర్ 2024 వరకు
ముఖ్యమైన సూచనలు
అభ్యర్థులు అప్లికేషన్ లో పొందుపరిచిన వివరాలను మాత్రమే పరిగణించి సెలక్షన్ చేస్తారు.
ఎటువంటి T, DA ఉండదు. సొంత ఖర్చులు పెట్టుకోవాలి.
ఒక అభ్యర్థి రెండు రకాల పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ రెండు అప్లికేషన్స్ వేరువేరుగా పెట్టుకోవాలి.
ఆఖరు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
అప్లికేషన్స్ లో పూర్తి సమాచారం లేకుండా ఉన్నచో అవి కూడా అంగీకరించబడవు.
ఎంపిక అయిన అభ్యర్థికి మాత్రమే సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
జిల్లా కోర్టు అధికారిక వెబ్సైటు నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.