Mini Job Mela: 6న మినీ జాబ్‌ మేళా

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలోని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా కార్యాలయంలో అక్టోబర్ 6న మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి సాయికృష్ణ చైతన్య తెలిపారు. యకోహామా టైర్స్‌ కంపెనీలో 100 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2019– 24 విద్యా సంవత్సరాల్లో ఐటీఐ, డిగ్రీ, డిప్లమోలో ఉత్తీర్ణత పొందినవారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని, ఎంపికై న అభ్యర్థులు అచ్యుతాపురంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 9292553352 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
 

చదవండి: AP Govt Jobs: మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

#Tags