Indian Air Force jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

Indian Air Force jobs

కరీంనగర్‌: జూలై 3 నుంచి 12 వరకు నిర్వహించే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ (సంగీతకారుడు) రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా 3 ఏఎస్‌సీ ఎయిర్‌ఫోర్స్‌ సంస్థ కాన్పూర్‌, 7 ఏఎస్‌సీ 1 కబ్బన్‌ రోడ్‌, బెంగళూరు (కర్ణాటక)లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు.

అగ్నిపథ్‌ పథకం ప్రవేశంతో క్లరికల్‌/టెక్నికల్‌ కేడర్‌లో ఉద్యోగ అవకాశం ఇప్పుడు 4 సంవత్సరాల సర్వీసుకు పరిమితం చేయబడుతుందని, అభ్యర్థుల్లో 25 శాతం మందికి శాశ్వత ప్రవేశం కల్పించబడునని పేర్కొన్నారు. అభ్యర్థులు (పురుషులు, మహిళలు) అవివాహితులై, 02 జనవరి 2004 నుంచి 02 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల/బోర్డు నుంచి కనీస పాస్‌ మార్కులతో మెట్రిక్యులేషన్‌/10వ తరగతి ఉత్తీర్ణత లేదా సమాన విద్య కలిగి ఉండాలన్నారు.

అభ్యర్థులు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలని, ఒక ప్రిపరేటరీ ట్యూన్‌, స్టాఫ్‌ నొటేషన్‌/టాబ్లేచర్‌/టానిక్‌ సోల్ఫా/ హిందుస్తానీ, కర్నాటిక్‌ మ్యూజిక్‌ మొదలైన వాటిని ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 22 ఉదయం 11 గంటల నుంచి జూన్‌ 5 రాత్రి 11 గంటల వరకు వెబ్‌ పోర్టల్‌ https:// agnipathvayu. cdac. inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సంబంధించి పూర్తి వివరాలకు సదరు వెబ్‌సైట్‌లో సందర్శించాలని జిల్లా ఉపాధి అధికారి పేర్కొన్నారు.

#Tags