jobs notification: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లాలోని ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓ అరుణకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ల్యాబ్ అసిస్టెంట్లు 2, కంప్యూటర్ అసిస్టెంట్ 1 పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు.
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 10వ తేదీలోపు నల్లగొండ ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 08682 223898ను సంప్రదించాలని సూచించారు.
#Tags