Jobs in medical college: వైద్య కళాశాలలో భారీగా ఉద్యోగాలు
స్థానిక వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రిలో భర్తీ చేయనున్న పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. 256 పోస్టులకు 11,705 దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
వీటిని బోధన ఆస్పత్రిలో సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలో అభ్యర్థుల జాబితాను కలెక్టర్ సుమిత్‌కుమార్ అందజేస్తామని పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి తెలిపారు.
ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం కలెక్టర్ ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ జరుగుతుందన్నారు.
#Tags